రేపు ఎంపీలో ఆరు పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్
ఇంటర్‌నెట్‌డెస్క్, హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు పోలింగ్ బూత్‌లలో డిసెంబర్ 2న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదు నియోజకవర్గాల్లోని ఆరు పోలింగ్ స్టేషన్‌లలో నవంబర్ 25న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. లెహర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని 182-బేరాయి, 189-ఇక్మిలి, సుమవాలి నియోజక వర్గంలోని 14-బహ్రారా, సిర్మౌల్ నియోజక వర్గంలోని 151- బైకుంత్‌పూర్, పనాగర్ నియోజక వర్గంలోని 145-బరేడా, దక్షిణ ఉజ్జైనినియోజక వర్గంలోని 100-ఉజ్జైని దశర మైదానాం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ విధానసభ స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడతాయి.