జస్టిస్ గంగూలీ రాజీనామా కోరిన తృణమూల్
కోల్‌కతా: లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత సశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ అశోక్ గంగూలీ తన పదవికి రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేడు డిమాండ్ చేసింది. ఆరోపణలు గతానికి సంబంధించినవే అయినప్పటికి ప్రజాభిప్రాయం మీద వాటటి ప్రభావం ఉంటుందని, ఆయన పదవికి రాజీనామా చేయడమే మంచిదని టీఎంసీ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ చీఫ్ వివ్ డెరెక్ ఓబ్రియన్ పేర్కొన్నారు.