విభజన ప్రకియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను తెదేపా, వైకాపాలోకి వెళ్లడం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూడా పోటీ చేసేది లేదన్నారు. తాము అద్దె ఇంటిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్నారు. వీలైనంత త్వరగా ఈ రాష్ట్రం సొంత ఇంటిలోకి వెళ్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు.