చంద్రబాబును విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు: మోత్కుపల్లి
హైదరాబాద్: చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదని, తెదేపాను విమర్శించే ముందు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని పైకి వచ్చిన సంగతి కేసీఆర్ గుర్తించాలని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కేసీఆర్ చేసేది తెలంగాణ పునర్నిర్మాణమా, పెత్తందారుల పునర్నిర్మాణమా అని ఆయన ప్రశ్నించారు. తాను కూడా ఆంధ్రా ప్రాంతం నుంచే సంగతి కేసీఆర్ గ్రహించాలన్నారు.