సచివాలయంలో ఉద్యోగుల మధ్య తోపులాట

హైదరాబాద్‌: తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాలకు చెందిన ఉద్యోగులు సచివాలయంలో పోటాపోటీ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతుండడంతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎల్‌ బ్లాక్‌ నుంచి సీ బ్లాక్‌ వరకు సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీకి పోటీగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఉద్యోగులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. భద్రతా సిబ్బందితో ఇరు ప్రాంతాల ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. సీ బ్లాక్‌ ముందు సీమాంధ్ర ఉద్యోగులు బైఠాయించారు. టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌ బయటి వారినా లోపలికి తీసుకువచ్చి గొడవ చేయిస్తున్నారంటూ నినాదాలు చేస్తున్నారు.