కూరగాయలు విక్రయించి నిరసన తెలిపిన తెదేపా నేతలు

హైదరాబాద్‌ : నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ విజయవాడలో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తెదేపా నగర ఆధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో కిలో రూపాయికే కూరగాయలు విక్రయించారు. నగర పార్టీ కార్యాలయం కేశినేని భవన్‌ నుంచి కూరగాయల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం లెనిన్‌ సెంటర్‌లో కిలో రూపాయికే కూరగాయలు విక్రయించి నిరసన తెలిపారు. బుద్దా వెంకన్నతో పాటు మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌, విజయవాడ పార్లమెంట్‌ నియోజక వర్గ తెదేపా ఇన్‌ఛార్జి కేశినేని నాని, బొండా ఉమ పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.