ట్రైబునల్ తీర్పులో విరుద్ధమైన భావాలు ఉన్నాయి : నారాయణ
న్యూఢిల్లీ: నీళ్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబునల్ తీర్పులో విరుద్ధమైన భావాలు ఉన్నాయని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ట్రైబునల్ తీర్పుతో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. 75 శాతం నీటి లభ్యత పట్టించు కోకుండా తీర్పు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆంద్రప్రదేశ్‌లో రెండు రాష్ట్రాలైన తర్వాత మళ్లీ బ్రిజేష్ కుమార్‌ను నియమించవద్దని ప్రధానిని కోరినట్లు వెల్లడించారు. నీటిజలాల పంపిణీలో రాజకీయ ప్రక్రియ ఉండాలని తాము కోరినట్లు పేర్కొన్నారు.