గడువులోపే తెలంగాణ

ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :
నిర్ణీత గడువులోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి పార్లమెంట్‌కు పంపిస్తారనే అశిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదించడానికి తాము గతంలోనే హామీ ఇచ్చామన్నారు. దీనిపై పదేపదే సందేహాలు పడవద్దన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం త్వరలోనే ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.