ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, కె.ఇ. ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నుంచి మంత్రి శైలజానాథ్‌, ఎంపీ సబ్బం హరి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సీపీఎం నుంచి వీరయ్య, వై. వెంకటేశ్వరరావు, లోక్‌ సత్తా నుంచి కటారి శ్రీనివాసరావు, రవి మారుత్‌ హాజరయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లు, భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో నేతలు చర్చించుకున్నారు.