టీ బిల్లుపై ఒక్కరోజు కూడా ఎక్కువ సమయమివ్వను

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ
హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చకు నిర్దేశిత సమయానికంటే అదనంగా ఒక్కరోజు కూడా సమయమివ్వని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి అంటున్నట్లుగా అదనపు సమయం ఇచ్చే ప్రసక్తే లేదని శనివారం తనను కలిసేందుకు వచ్చిన తెలంగాణ ప్రాంత నాయకులతో ప్రణబ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో చర్చించకుండా సీఎం కిరణ్‌తోపాటు సీమాంధ్ర అడ్డుకుంటున్నారని బీజేపీ నేతల బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ వాళ్లు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వారికి సమాధానమిస్తూ రాష్ట్రపతి తెలంగాణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించేందుకు కావాల్సినంత సమయం ఇచ్చానని, ఒక్క రోజు కూడా ఎక్కువ గడువివ్వనని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు.