ఈ తరం నాయకులకు సంజీవరెడ్డి స్ఫూర్తి : గవర్నర్
హైదరాబాద్ : ఈ తరం రాజకీయ నాయకులకు నీలం సంజీవరెడ్డి స్ఫూర్తి అని గవర్నర్ నరసింహన్ అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ… సంజీవరెడ్డిగొప్ప రాజకీయ వైతాళికుడని కొనియాడారు. అనంతపురంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు.