భర్త జీతం వివరాలు తెలుసుకోవడం భార్య హక్కు:కేంద్ర సమాచార కమీషన్‌ సృష్టీకరణ

న్యూఢీల్లీ,జనవరి 19(జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త జీతభత్యాల వివారాలను తెలుసుకొనే హక్కు భార్యకు ఉంటుందని కేంద్ర సమాచార కమీషన్‌ (సీఐసీ) స్పష్టం చేసింది.ఈ వివారాలు అర్‌టీఐ చట్టంలోని స్వచ్చంద బహిర్గత క్లాజు 4(1)(బి) (ఎక్స్‌) కింద ……సంబంధిత కార్యాలయాలు బహిరంగ పరచాల్సీందేనని తేల్చిచెప్పింది.జీతం వివరాలు తెలుసుకోవడం జీవిత భాగస్వామికున్న పూర్తి హక్కు అని, ముఖ్యంగా జీవన భృతికి ఇది చాలా అవసరమని సమాచార కమీషనర్‌ మాడభుషి శ్రీదర్‌ ఆచార్యులు స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నులు నుండి సహజంగా ఉద్యోగికి జీతం చెల్లిస్తారని,కాబట్టి ఆసమాచారాన్ని బహిర్గత పరచడం తప్పనిసరి అని చెప్పారు. ఈవివరాల కోసం ఎవరైన దరఖాస్తు చేస్తే వాటిని తిరస్కరించడానికి వీల్లేదు అని ఉద్ఘాటించారు ఇలాంటి సమాచారం ఇవ్వడానికి తిరస్కరించి ఢీల్లీ ప్రభుత్వం హోం శాఖ తప్పు చేసిందని, దీనికి జరిమానా ఉంటుందని చెప్పారు.