కేంద్రమంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి

ముంబయి,జనవరి24(ఆర్‌ఎన్‌ఎ): ఇటీవల ముంబయిలో హత్యకు గురైన సాప్ట్‌వేర్‌ ఇంజినీరు అనూహ్య హత్యకేసులో న్యాయం జరిపించాలని అనూహ్య తండ్రి కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలిశారు. అనూహ్య హత్యకేసు దర్యాప్తును త్వరగా పూర్తిచేసి నేరస్థులను శిక్షించాలని ఆయన ¬ంమంత్రికి విజ్ఞప్తి చేశారు. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని అనుహ్య హత్య కేసులో నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కేంద్ర ¬ం మంత్రి షిండేను ఆమె తండ్రి కలిశారు. మచిలీపట్నంకు చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని ఎస్తేర్‌ అనూహ్య(23)ను గుర్తు తెలియని దండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. కేసుపై త్వరగా విచారణ జరిపించి నేరస్తులను శిక్షించాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ముంబైలో టీసీఎస్‌లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. క్రిస్మస్‌ సెలవులు కావటంతో డిసెంబర్‌ నెలలో సొంత ఊరికి వచ్చిన ఆమె తిరిగి ముంబయ్‌ వెళ్లేందుకు ఈ నెల 4న విజయవాడలో రైలు ఎక్కింది. ఒకసారి తండ్రి ప్రసాద్‌ కు ఫోన్‌ చేసి మాట్లాడింది. తరువాత ఆమె కుటుంబసభ్యులకు ఫోన్‌ రాలేదు. దీనితో ప్రసాద్‌ పలుమార్లు అనూహ్యకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ కలవకపోవడంతో విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. స్టేషన్‌ లో ఆమె మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. ముంబయ్‌ లోని కుంజుమార్గ్‌ సవిూపంలో జనవరి 16వ తేదీన పోలీసులు కాలి పోయివున్న ఓ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాం చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా అనూహ్యగా ప్రసాద్‌ గుర్తించారు. ఈ ఘటనలో ముంబయి పోలీసులు వైఫల్యం ఉందని అనూహ్య కుటుంబసభ్యులు ఆరోపించారు.