-->

మోడి హార్డ్‌ వర్కర్‌ : కరుణానిధి

చెన్నై : మెలమెల్లగా డీఎంకే పార్టీ బీజేపీ పంచన చేరేందుకు పావులు కదుపుతోంది. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడిపై ప్రశంసల జల్లు కురిపించారు. మోడి ఎన్నికల ప్రచార తీరును ఆయన మెచ్చుకున్నారు. మోడి పని రాక్షసుడని, పార్టీ గెలుపుకోసం ఆయన పడే తపన చూస్తూ ఆశ్చర్యవేస్తుందన్నారు. మోడి తనకు మంచి మిత్రుడని కూడా చెప్పారు. కమ్యూనల్‌ శక్తులతో పొత్తు పెట్టుకోబోమని రెండు నెలల క్రింత జరిగిన డీఎంకే రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ప్రకటించారుగా… మరి ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరేందుకు ఇష్టపడుతున్నట్లున్నారు? ప్రశ్నించగా… లోక సభ ఎన్నికల తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు ఊహించగలరు అని సమాధానం దాటవేశారు.