రాష్ట్రపతి వద్ద బిల్లు


తెలంగాణకు ఏడు, సీమాంధ్రకు మూడు కేంద్రీయ విద్యాలయాలు
తెలంగాణ ఏర్పడ్డాకే సీమాంధ్రులకు కొత్త రాజధాని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లును మొదట న్యాయశాఖ పరిశీలన కోసం పంపారు. చట్ట పరమైన అన్ని అంశాలపై లోతైన అధ్యయనం చేసిన ఆ శాఖ బిల్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపింది. హోం మంత్రిత్వ శాఖ ముసాయిదాను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వద్దకు పంపింది. ఆయన రెండు మూడు రోజుల్లో తెలంగాణ బిల్లుపై సంతకం చేస్తారని, ఆ తర్వాత గెజిట్‌ పబ్లికేషన్‌ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అదే రోజు రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే తేదీ (అపాయింటెడ్‌ డే)ని ప్రకటిస్తారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణలో ఏడు, సీమాంధ్ర ప్రాంతంలో మూడు కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ తెలిపారు. దేశంలో 54 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. వీటిలో తెలంగాణలో ఏడు, సీమాంధ్రలో 3 ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలోని వరంగల్‌, సికింద్రాబాద్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ, సీమాంధ్రలోని కడప, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఏడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీమాంధ్రలో మూడు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు జైంరాం ప్రకటించారు. ప్రతి విద్యాలయానికి కేంద్రం నుంచి రూ. 15 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల కమిటీ సీమాంధ్రకు రాజధానిని ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయని జైరామ్‌ రమేష్‌ చెప్పారు. రాజధాని కోసం అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. నిపుణుల కమిటీ రాజధాని విషయం తేల్చుతుందన్నారు. సీమాంధ్రలో మూడు, తెలంగాణలో ఏడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి విశ్వవిద్యాలయానికి పదిహేను కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ సస్పెండెడ్‌ యానిమేషన్‌లో ఉందన్నారు. అది ఎన్ని రోజులు ఉంటుందో అప్పుడే చెప్పలేమని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ¬దా ఇస్తున్నామని, పదేళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తున్నామని చెప్పారు. కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కారణంగా అక్కడ విద్యార్థులకు మేలు చేకూరగలదని అన్నారు.ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిపారు. రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చాక, గెజిట్‌లో ప్రకటన తర్వాత నోటిఫైడ్‌ డే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధప్రదేశ్‌లో ఇప్పటికే మంత్రివర్గం రాష్ట్రపతి పాలన ప్రకటించిందన్న ఆయన, రాష్ట్ర శాసనసభ సుప్తచేతనావస్థలో ఉందన్నారు.