రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తున్నాం : కోదండరామ్
హైదరాబాద్ : రాజకీయ, ప్రజాసంఘాల, ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్రపతి పాలన విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ పార్టీగా మారదు… భవిష్యత్‌లోనూ ఇలాగే ఉంటుందని చెప్పారు. తెలంగాణకు అడ్డుపడ్డ టీడీపీ, వైసీపీని మేం వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో తెలంగాణ జేఏసీ ఉంటుందన్నారు. భవిష్యత్‌లో మేం వాచ్ డాగ్ పాత్రను పోషిస్తామన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఉత్సవాల నిర్వహణ కోసం కమిటీ వేశామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు.