టీఆర్‌ఎస్ వేసిన కమిటీని స్వాగతిస్తున్నాం: దిగ్విజయ్
ఢిల్లీ: ఇతర పార్టీలతో పోత్తుపై టీఆర్‌ఎస్ వేసిన కమిటీ స్వాగతిస్తున్నామని ఏఐసీసీ జరనరల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విలీనాన్ని తిరస్కరించడం టీఆర్‌ఎస్ ఇష్టం. దీనిపై మేం మాట్లాడం. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారు. తెలంగాణపై హామీ ఇచ్చాం. నెరవేర్చాం అని ఆయన పేర్కొన్నారు.