సుధీర్ఘపోరాటాల ద్వారానే తెలంగాణ సాధన: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : సుదీర్ఘపోరాటాలు , బలిదానాల తర్వాతే తెలంగాణ ఏర్పాటుచేసుకున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ప్రజల్లోకి తెలంగాణ భావజాలం తీసుకుపోవడంలో తెలంగాణ పాత్రికేయుల కృషి అభినందనీయమాన్నారు. తెలంగాణ తమ విధానమని చెప్పిన జర్నలిస్టుల పోరాటం మర్చిపోలేనిదని ఆయన అన్నారు.