మళ్లీ అధికారం కాంగ్రెస్‌ పార్టీదే : జైరాం

నిజామాబాద్‌ : మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్‌ పార్టే వస్తుందని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్‌ పార్టీకి కవల పిల్లలాంటి వారు అని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ రబ్బర్‌ స్టాంప్‌ పార్టీ కాదని, తాము ఎవరికీ తలవంచిదండాలు పెట్టమని పేర్కొన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో లబ్ధి పొందేందుకు సుష్మాస్వరాజ్‌, వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు.