ప్రతికారం తీర్చుకుంటాం.. మూల్యం చెల్లించక తప్పదు
మావోయిస్టుల దాడిపై ఎన్‌ఐఏ విచారణ : షిండే
రాయపూర్, మార్చి 12 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లను బాంబుపేల్చి హతమార్చిన మావోయిస్టులపై ప్రతికారం తీర్చుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే హెచ్చరించారు. మావోయిస్టులు ఈ ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల దాడి ఘటనపై విచారణను ఎన్‌ఐఏకు అప్పగిస్తామని కేంద్ర షిండే వెల్లడించారు. మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం షిండే మాట్లాడుతూ, మావోయిస్టుల దాడి ఘటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టుల దాడికి ప్రతిగా చర్యలు తీసుకుంటామని షిండే స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని షిండే చెప్పారు. మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు షిండే నివాళులర్పించారు. మావోయిస్టుల దాడికి ప్రతీకార చర్యలు తీసుకుంటామన్నారు. మావోయిస్టు దాడి ఘటనపై విచారణను ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నామని తెలిపారు.