కష్టకాలం
పార్టీని వీడేవారు ఆలోచించుకోండి
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా
హైదరాబాద్, మార్చి 13 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీని వీడేవారు ఆలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగిన వారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమదారి వెదుక్కోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ అన్నది తాను పదవిగా భావించటంలేదని, అదో బాధ్యతగానే భావిస్తున్నానని రఘువీరారెడ్డి అన్నారు. పార్టీలో ఇంకా మిగిలి ఉన్న నిజాయితీగల కార్యకర్తల సహకారంతో కలిసి పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తానని అధిష్టానంతో చెప్పానన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని రఘువీరా వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు ఎన్నికల సమయంలో పార్టీని వీడారన్నారు. పార్టీని వీడుతున్నవారు ఒకసారి పునరాలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను గుర్తెరిగి అనుక్షణం తన బాధ్యతతో పని చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైనదని, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని బిల్లులో చేర్చడం జరిగిందన్నారు. కాగా ఆంధ్రపద్రేశ్‌కు తొలి పీసీసీ అధ్యక్షుడుగా నియమించినందుకు రఘువీరారారెడ్డి ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ¬టల్లో మీడియా సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉండి అనేక బాధ్యతలు నిర్వర్తించానని, ఇప్పుడు ఏపీ పీసీసీగా హైకమాండ్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు. కాంగ్రెస్‌లో ఎన్నో పదవులు అనుభవించినవారు ఎన్నికల ముందు పార్టీని వీడటం బాధాకరమని రఘవీరా వెల్లడించారు. పార్టీ నుంచి వెళ్తున్న వారు పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. కొంత నష్టం జరిగినా అందరం పంచుకుందామని పిలుపునిచ్చారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రధాని ప్రకటించారని, సీమాంధ్రకు జరుగుతున్న మంచి గురించి విభజన చట్టంలో పొందుపరిచారన్నారు. 13 జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి, 90 శాతం నిధులు వచ్చేలా చేశారనని చెప్పారు. 10 ఏళ్ల వరకు రాయితీ కల్పించారని రఘువీరా పేర్కొన్నారు. పాతికేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక బాధ్యతలు నిర్వహించానని ఆంధప్రదేశ్(సీమాంధ్ర) పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘించకూడదనే ¬టల్‌లో ప్రెస్‌మీట్ పెట్టామన్నారు. తనకు అప్పగించిన దాన్ని పదవిగా భావించడం లేదని, బాధ్యత అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు ఎన్నికల ముందు పార్టీ వీడారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఇటీవల వదిలివెళ్లినవారు, వెళ్లాలనుకుంటున్నవారు పునరాలోచించాలని రఘువీరా కోరారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు అందరూ మంచిని పంచుకున్నామని, ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీకి కొంత నష్టం జరిగినా అందరం పంచుకుందామని రఘువీరా పేర్కొన్నారు. పార్టీలో ఉన్న అందరినీ సమన్వయం చేసుకుంటూ బాధ్యతలు నిర్వహిస్తానన్నారు.