నేడు కేంద్రమంత్రి కావూరి భవిష్యత్‌ కార్యాచరణ సభ

ఏలూరు, మార్చి 15 : రాజకీయ భవిష్యత్‌కార్యాచరణ రూపకల్పనపై కేంద్ర  జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు సమావేశాన్ని 16వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్త్నుట్లు మంత్రి పిఆర్‌ఓ పి.శ్రీరాముల తెలిపారు.  ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌కార్యకర్తలు కావూరు అభిమానులతో నిర్వమించే ఈ సమావేవంల ఏలూరు(వట్లూరు) సిఆర్‌ఆర్‌ మహిళా కళాశాల ప్రక్కన ఉన్న శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై కాంగ్రెస్‌ కార్యకర్తలనుండి, కావూరి అభిమానుల నుండి అభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు, పోలవరం, కైకలూరు,నూజీవీడు శాసనసభా నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు, కావూరి అభిమానులు తరలి రావాలని పి.శ్రీరాములు కోరారు.