జోరుగా పంపకాలు
- నిర్దిష్టకాలంలోనే రెండు రాష్ట్రాలు
- రీజూన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సీఎంలు
- ఆ దిశగా కేంద్రం అడుగులు
- క్లిష్టమైన అంశాలు, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మాట్లాడుకోవచ్చు
- సచివాలయంలో బిజీబిజీగా గడిపిన అనిల్ గోస్వామి
హైదరాబాద్, మార్చి 18 (జనంసాక్షి) :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పంపకాల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగ వంతం చేసింది. నిర్దిష్ట కాలంలోనే రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టింది. ఇందుకోసం పంప కాల ప్రక్రియను శరవేగంగా సాగిస్తోంది. మంగళవారం పంపకా ల ప్రక్రియపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి సహా పలువురు ముఖ్య అధికారు లు హాజరయ్యారు. పంపకాలపై హోమ్ మంత్రిత్వ శాఖ హైదరా బాద్‌లో నిర్వహించిన తొలి సమీక్ష సమావేశం ఇదే. సచివాల యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనిల్ గోస్వామితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, 15 సబ్ కమి టీల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కమిటీల ఇన్‌చార్జిలు పంపకాల ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనిల్ గోస్వామితో పాటు కేంద్ర, రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులతో సమీక్షించారు. పంపకాల ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించుకున్నట్టు సీఎస్ మహంతి తెలిపారు. కాగా రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతోన్న తీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కన్నా ముందే విభజన పనులు పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు. అపాయింటెడ్ డేగా జూన్ 2ను నిర్దేశించిన నేపథ్యంలో ఆలోగానే ఆర్థిక శాఖ పంపకం, దస్త్రాల పంపకాలు, ఇతర కీలకమైన వ్యవహారాలు పూర్తి చేయాలని అనిల్ గోస్వామి ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అలాగే కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర పంపకాల పనులను అపాయింటెడ్ డే తర్వాత కూడా కొనసాగించవచ్చని అధికారులు తెలిపారు. అపాయింటెడ్ డే తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లను పంపకాల ప్రక్రియ చూస్తున్న సబ్ కమిటీల బాధ్యులు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయంలో పొద్దంతా బిజీబిజీగా గడిపిన హోమ్ శాఖ కార్యదర్శి అనంతరం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.