సామాజిక తెలంగాణే ధ్యేయం
రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 18 (జనంసాక్షి) :
సామాజిక తెలంగాణ స్థాపనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వ హించిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆయన మట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణమే తమ లక్ష్యమని, అవకాశాలకు దూరంగా ఉన్న వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడతామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బృహత్ ప్రణాళికతో ముందుకు వస్తామని, ప్రజల ఆకాంక్షలే తమ ఎజెండాలో ప్రధానంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీని రైతు సంఘం, యువజన కాం గ్రెస్, ఎస్సీ సెల్, తెలంగాణ సినీ పరిశ్రమ కౌన్సిల్ సభ్యులు కలిసి పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వినతిపత్రాలు అందజే శారు. సమావేశంలో డెప్యూటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు.