భవిష్యత్తును డబ్బుకోసం అమ్ముకోవద్దు: కమల్‌హాసన్‌

భవిష్యత్తును డబ్బుకోసం అమ్ముకోవద్దు: కమల్‌హాసన్‌
చెన్నై: ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రముఖనటుడు కమల్‌హాసన్‌ను ప్రచార సారథిగా ఎంచుకుంది. ఆయన నటించిన ఒక ప్రత్యేక వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏ నేత ఎక్కువ డబ్బు ఇస్తాడో పోల్చుకుని ఓటు వేయకండి. ఏ నేత చేతిలో మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందిని భావిస్తున్నారో వారికే ఓటువేయండి. కొద్దిపాటి నగదు కోసం మీ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును అమ్ముకోవద్దు. అని ఈ వీడియోలో కమల్‌ హాసన్‌ చెప్పారు.