గుజరాత్ అల్లర్లకు మోడీదే నైతిక బాధ్యత
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్
న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) :
గుజరాత్‌లో మైనార్టీల ఊచ కోతకు నరేంద్రమోడీదే నైతిక బా ధ్యత అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. గోద్రా అనం తర అల్లర్లకు నైతిక బాధ్యత నుంచి
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తప్పించుకోజాలరని శరద్‌పవార్ పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ కేసులో మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చినా నైతిక బాధ్యత ఆయనదేనన్నారు. కోర్టు తీర్పును గౌరవించాల్సిందే. అయితే నేను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ తరహా అల్లర్లు జరిగితే దానికి నేను నైతిక బాధ్యత వహించలేనని తప్పించుకోలేను. మోడీ సహా ఏ ముఖ్యమంత్రికైనా ఇదే వర్తిస్తుందని పవార్ సీఎన్‌ఎన్ – ఐబీఎన్ టీవి ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ఎన్సీపీ భాజపాతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకునే ప్రశ్నేలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే 100 సార్లు చెప్పానని పవార్ కుండబద్దలు కొట్టారు. రానున్న ఎన్నికల్లో భాజపా మేజిక్ సంఖ్య (272 సీట్లు)ను చేరుకోలేదని, అందువల్ల మోడీ ప్రధానమంత్రి అవుతారా కాదా అనే పరిస్థితే ఉత్పన్నం కాదన్నారు.