శేషాచల అడవుల్లో అదుపులోకి మంటలు

శ్రమిస్తున్న నావికాదళ హెలికాప్టర్లు
తిరుమల, మార్చి 20 (జనంసాక్షి) :
తిరుమల వెంకన్న కొండల్లో ఒకటైన శేషాచలం అడ వుల్లో మంటలు అదుపులోకి వస్తున్నాయి. శేషాచల అడ వుల్లో చెలరేగిన కార్చిచ్చు చల్లార్చడానికి రంగంలోకి దిగిన మూడు హెలికాప్టర్లు నిరంతరం శ్రమిస్తున్నాయి. నావికాదళానికి చెందిన నాలుగు హెలికాప్టర్లు రేణిగుంట విమాశ్రయానికి చేరుకోగా రెండు హెలికాప్టర్లు తిరు మలలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం రాత్రి వరకు మంటలు కొంతమేర అదుపులోకి వచ్చాయి. కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల నుంచి హెలికాప్టర్లలో నిటిని నిం పుకొని మంటలను ఆర్పే పనులు చేపట్టారు. కాకులకోన అడవిలో సంభవించిన నష్టాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఈవో గోపాల్‌ పరిశీలించారు. పాపవినాశనం మార్గంలోని కాకులకోన అడవి పూర్తిగా కాలిపోయింది. దీంతో మంటలు చల్లారా యి. పాపవినాశనం మార్గం వైపుగా మంటలు ఆర్పేం దుకు ప్రయత్నిస్తున్నారు. శేషాచల అడవుల్లో అగ్నిప్ర మాదం జరిగిన ప్రాంతాలను అగ్నిమాపక శాఖ డీజీ సాంబశివరావు పరిశీలించారు. మంటలు విస్తరించకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరిం చారు. పాపవినాశనానికి భక్తులు వెళ్లకుండా అధికారులు దారిని నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. మంటలు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దుకాణాలు కూడా మూయించి వ్యాపారులు తిరుమలకు తరలించారు.