ఘనంగా శ్రీమాధవస్వామి రథోత్సవం
ఘనంగా శ్రీమాధవస్వామి రథోత్సవం
హైదరాబాద్: ర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో శ్రీమాధవస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ ో్మత్సవాన్ని పురస్కారించుకుని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దివ్య క్షేత్రంలో కొలువుదీరిన మాధవస్వామి, లక్ష్మీదేవిలను పట్టువస్త్రాలు, ఆభరణాలతో ముస్తాబు చేసి అగమ శాస్త్ర క్రమంగా పండితులు పూజలు నిర్వహించారు. రథోత్సవానికి కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. కొలిచినవారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మాధవస్వామి రథోత్సవ వేడుకను తికలించేందుకు ఆంధ్ర నుంచే కాక కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.