నగ్మాను ముద్దు పెట్టుకునేందుకు


యత్నించిన ఎమ్మెల్యే
జనం ఆగ్రహం
మీరట్‌, మార్చి 23 (జనంసాక్షి) :
ఓ ఎమ్మెల్యే పట్టపగలు ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. ప్రజల మధ్య తన తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన మాజీ హీరోయిన్‌,
కాంగ్రెస్‌ నేత నగ్మాను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. మీరట్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గిరిరాజ్‌ శర్మ నగ్మా పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అతడి తీరుతో నగ్మాతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు షాక్‌కు గుర్యారు. ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి అనే విషయాన్ని విస్మరించి ఎంపీ అభ్యర్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన శర్మపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. మీరట్‌లో నగ్మా నామినేషన్‌ వేసేందుకు రాగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఆమె అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. వారిని అదుపు చేయలేక పోలీసులు నానా అవస్థలు పడ్డారు.