మోడీ గుజరాతీయే
ఆయన జాతీయ భావాలు లేవు
సంకుచిత మనస్తత్వం : శరద్‌పవార్
ముంబై, మార్చి 23 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ గుజారా తీయే తప్ప జాతీయ నా యకుడు కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్‌పవార్ అన్నారు. నవీ ముంబైలో ఆయన ఆదివారం మీడి యాతో మాట్లాడారు. మో డిది పూర్తిగా సంచుకిత స్వభావమని అభివర్ణిం చారు. గతేడాది వర్షాభా వంతో దెబ్బతిన్న ప్రాంతా లకు పశుగ్రాసం పంపిణీకి సహకరిం చిన సొంత రాష్ట్ర ప్రజలపైనే కేసు నమోదు చేయించిన ఘనత మోడీదన్నారు. గుజరాత్‌లోని మోహ్సానా జిల్లాలో ప్రజలు అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదు చేయించా రని తెలిపారు. ఈ సమాచారం తెలియడంతో గుజరా త్‌లో వర్షాభావ ప్రాంతాలకు పశుగ్రాసాన్ని తిప్పిపం పామని అన్నారు. దేశాన్ని పాలించాలన్న ఆకాంక్ష ఉన్న నేతలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలను కూడా సొంతవారిగానే భావించాలని, ఇలాంటి సంకుచిత మనస్తత్వం గల నేత దేశానికి సారథ్యం వహించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మోడీకి దేశ చరిత్ర తెలియదని,అలాంటి వ్యక్తి ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తున్నాడని పవార్ ఎద్దేవా చేశారు.