టీఆర్‌ఎస్‌కు ఇబ్రహీం గుడ్‌బై


అవమానాలు బరించే ఓపిక లేదు : ఇబ్రహీం
మహబూబ్‌నగర్‌్‌, మార్చి 28 (జనంసాక్షి) :
మహబూబ్‌నగర్‌ నియోజ కవర్గ టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జి ఇబ్రహీం పార్టీకి రాజీనామా చేశారు. ఇబ్ర హీం ప్రస్తుతం పార్టీ పొలి ట్‌బ్యూరో
సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2009 సాధారణ, 2011 ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. 2011 ఉప ఎన్నికల సమయంలో జేఏసీ ఏ పార్టీకి మద్దతు తెలుపకపోవడంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 14 వందలకు పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండు పర్యాయాలు స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఇబ్రహీంను పక్కనబెట్టి మహబూబ్‌నగర్‌ స్థానాన్ని టీజీవో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ సీటు ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ దశలో టీఆర్‌ఎస్‌లో కొనసాగడం ఇష్టం లేక ఆయన బయటకు వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఆహ్వానించినట్టుగా సమాచారం.