తేల్చుకుందాం రా

వేదికెక్కడో చెప్పు

పొన్నాలపై హరీశ్‌ ఫైర్‌

హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) :

కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి విష యంలో తేల్చుకుందాం రాం అం టూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు టీపీపీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు సవాల్‌ విసిరారు. అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌తో చర్చకు సిద్ధమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొ న్నాల విసిరిన సవాలును స్వీక రిస్తున్నట్లు ఆపార్టీ ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు. తెలంగా ణాలో వివిధ ప్రాజెక్టులపైన చర్చకు తాము సిద్దంగా ఉన్నామ న్నారు. తె లంగాణభవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడు తూ.. పొన్నాల సవాలుపై చర్చ కు సిద్ధమని పేర్కొ న్నారు. చర్చ ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్రాజెక్ట్‌పై అనేది పొన్నాల నిర్ణయి స్తే అక్క డికి వచ్చి చర్చించడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ఈ సవాలును పొన్నాల స్వీకరిస్తారా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్‌ వల్లే తెలంగాణ వచ్చింది అని
చెప్పడం హాస్యస్ప దమన్నారు. సమైక్య రాష్ట్రం లో నీటి దోపిడీ జరిగింది. ఇది సత్యం. దీనికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. తెలంగాణ ప్రాజెక్టులపై కూడా చర్చకు సిద్దమన్నారు. లేదా పదేళ్ల కాంగ్రెస్‌ పాలనపైనా చర్చకు సిద్దమన్నారు. దేనిని ప్రజల ముందుకు తీసుకుని వెళ్దామన్నా సిద్దమన్నారు. పొన్నాల ఉద్యమం చేశారనడం అబద్ధం, హాస్యస్పదమన్నారు. . సచివాలయానికి పోకపోవడాన్నే ఉద్యమం అంటారా? ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టిన విూరు ఉద్యమం చేసినట్లా? విూరు ఇంట్లో కూర్చొని సంతకాలు చేసిన వాటిపై ఆధారాలు చూపించడానికి కూడా మేం సిద్ధమని పొన్నాలకు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. వైఎస్‌కు వసూళ్లు చేసిపెట్టింది. కిరణ్‌కు వంగి సలామ్‌ చేసింది పొన్నాల అని మండిపడ్డారు. ఇవన్నీ నిజం కాదా అని ప్రశ్నించారు.