అవినీతి, అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరం
టీ పీసీసీ చీఫ్ పొన్నాల
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :
కేసీఆర్ అవినీతి, అభివృద్ధి గురించి మా ట్లాడటం విడ్డూరంగా ఉందని టీ పీసీసీ చీఫ్ పొ న్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురిం చి తెలియనిదెవరికని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. పొత్తులు కుదిరితే కనీస ఉమ్మడి ప్రణాళిక ఉంటుందన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేం దుకే కేసీఆర్ అభివృద్ధి జపం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఓ మాట వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. అభివృద్ధి టిఆర్‌ఎస్ తో సాధ్యం కాద ని, కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు గురించి ఇన్నేళ్లు మాట్లాడని కేసిఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లా డుతున్నారో తెలపాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడ్డు పడుతున్నాడని తెలియ జేశారు. కాంగ్రెస్ పై
కేసిఆర్ దుష్ప్రచారాలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పొన్నాల హెచ్చరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ కొత్తకొత్త హామీలు గుప్పిస్తే ప్రజలు నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. నిన్న మొన్న పుట్టిన పార్టీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయని ఆయన విమర్శించారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా తెరాస తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇంతకాలం రాజకీయాల్లో ఉండి కేసీఆర్ మెదక్ అభివృద్ధికి ఏం చేశారని పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని పొన్నాల పేర్కొన్నారు. పేదలకు భూపంపిణీపై కేసీఆర్ హామీ ఆచరణ సాధ్యంకాదని, లేని భూమిని ఎలా పంచుతారని పొన్నాల ప్రశ్నించారు. తెరాసతో పొత్తుకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్న పొన్నాల పొత్తు కుదిరితే కనీస ఉమ్మడి ప్రణాళిక ఏర్పాటుచేస్తామన్నారు. సీపీఐతో పొత్తుకు సూతప్రాయంగా అంగీకారం కుదిరిందని, ఒకటిరెండు రోజుల్లో వివరాలు చెప్తామని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులకు టికెట్లు అడగడం నేరం కాదని పొన్నాల పేర్కొన్నారు. అయితే జాబితా రెడీ అవుతుందని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో టీఆర్‌ఎస్‌కు ద్వారాలు తెరిచే ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే.. కనీస ఉమ్మడి ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్సేనని ఆయన చెప్పారు. కేసీఆర్ కొత్త కొత్త హామీలు గుప్పిస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. ఇదిలావుంటే గాంధీభవన్‌కు బౌన్సర్లతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రజలతో పాటు టిక్కెట్ ఆశావహుల నుంచి తాకిడి ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వద్ద బౌన్సర్లతో భద్రత ఏర్పాటుచేశారు. టికెట్ ఆశావహుల సందడిని తట్టుకునేందుకు బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిక్కెట్ల కోసం ఆందోళనకారులు గాంధీభవన్ ముందు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.