ఊసరవెల్లులే ప్రమాదం


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అనేక చట్టాలు యూపీఏ హయాంలోనే
మహిళా సాధికారత మా వల్లే సాధ్యం : సోనియాగాంధీ
ససరాం, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) :
రాజకీయాల్లో రంగులు మార్చే ఊసర వెల్లులు ప్రమాదకరమైనవని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నా రు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశా రు. బీహార్‌లోని ససరాం లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం నిర్వహించి న ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీహార్‌ సీఎం నితీ శ్‌కుమార్‌లను ఉద్దేశించి సోనియా పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతంద దేశంలో పరీక్షాకాలం కొనసాగుతోందని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా రంగు లు మార్చే ఊసరవెల్లులు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తమ హస్తగతం చేసుకునేం దుకు సదరు శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తమ తప్పుల ను కప్పి పుచ్చుకోవడానికే కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కొందరు తమ వల్లే అభివృద్ధి జరిగిందంటూ ప్రచారం చేసు కుంటున్నారని, అసలు అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో
అందరికీ తెలుసన్నా రు. దేశాభివృద్ధితో పాటు మత సామరస్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ కోరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌, స్థానిక ఎంపీ అభ్యర్థి మీరాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.