అధికారం అడిగే హక్కు మాకే ఉంది
తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే సర్కార్
అమరవీరులకు కుటుంబాలకు
పది లక్షల ఎక్స్‌గ్రేషియా
ఉచిత నిర్బంధ విద్య
పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు
కార్పొరేట్ వ్యవసాయ విధానం
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్
టీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల
69 మందికి టికెట్లు ఖరారు చేసిన కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (జనంసాక్షి) :తెలంగాణలో అధికారం అడిగే హ క్కు తమకే ఉందని టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఏర్పడ బో యే మొదటి ప్రభుత్వం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా హామీ పత్రాన్ని ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అలాగే పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో కె.కేశవరావు, కడియం శ్రీహరి, మధుసూధనాచారి తదితరులతో కలసి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో అధికారన్ని కోరే హక్కు ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబును, ఉద్యమంలో లేని కాంగ్రెస్‌ను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో చేపట్టబోయే పనులతో పాటు, అమలు చేయబోయే కార్యక్రమాలను వివరించారు. పనిలో పనిగా రాజకీయ పార్టీలపైనా విరుచుకుపడ్డారు. ప్రధానంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపైనా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఓ పెద్ద శని అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనో గోముఖ వ్యాఘ్రమని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రా పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీల నుంచి విముక్తి కోసం 60 ఏళ్లు పోరాడారని, మళ్లీ ఆంధ్రా పార్టీలతో జతకట్టవద్దని అన్నారు. తెలంగాణ ఏర్పడకుండా చంద్రబాబు చివరి నిముషం వరకు అడ్డుపడ్డారని అన్నారు. పార్లమెంటుకు బిల్లు వచ్చాక కూడా అడ్డుకున్న పక్కా తెలంగాణ వ్యతిరేకి అని దుయ్యబట్టారు. శ్రీకాకుళం సభలో కూడా తనకు ఎంపీల బలం ఉంటే తెలంగాణను ఆపేవాడినని అన్న విసయాన్ని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణ వ్యతిరేక చంద్రబాబు పార్టీకి సమాధి కట్టాలన్నారు. తెలంగాణ ప్రజలు తమకు తెలంగాణ పార్టీ కావాలో సీమాంధ్ర పార్టీ కావాలో తేల్చుకోవాలన్నారు. ఇన్నేళ్ల పోరాటం చేసి తెలంగాణ విముక్తం చేసుకున్న తరవాత ఇప్పుడు మళ్లీ ఆంధ్రపార్టీ వలలో పడితే గోసపడక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు కిరాయి పాలన, ఆంధ్రా పాలన కావాలా లేక సొంతపాలనా కావాలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. వీరిపాలనలో తరలుగా కోలుకోలేకపోయాం. ఆరుదశాబ్దాల పాలనలో కోలుకరోలేకపోయామన్నారు. రాజీపడి టిడిపికి ఓటు వేయవద్దన్నారు. ఈ ఎన్నికల్లో 14 ఎంపీలు,75 అసెంబ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 50 శాతం బలహీనవర్గాలుకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. టిడిపి పరాయిపాలన నుంచి మనం విముక్తం కావాలన్నారు. ఇక కాంగ్రెస్ నేతలు నేతలు పిచ్చికూతలు మానాలన్నారు. ఎవరు ఏంటన్నది కొన్ని రోజుల్లో ప్రజలు తేల్చ బోతున్నారని అన్నారు. సిఎం కావాలని, అధికారంలోకి రావాలని టిఆర్‌ఎస్ కోరుకోవడంలో తప్పులేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మాకు మాత్రమే ఆ అర్హత ఉందన్నారు. అంతేగానీ సీమాంధ్ర ముఖ్యమంత్రి పక్కన నక్కిన పొన్నాల మొబైలేజషన్ అడ్వాన్సులు పుచ్చుకుని తనపై విమర్శలు చేయడామా అని ఎద్దేవా చేశారు. మాకు లేని అర్హత నీరకు ఎక్కడిదన్నారు. నీసంగతి నాసంగతి ప్రజలు తేలుస్తారని అన్నారు. కాంగ్రెస్ 30 సీట్లకరు మించి దాటదన్నారు. అభివృద్ది గురించి మాట్లాడడమా.. అని ప్రశ్నించారు. జేబులు నింపుకునే అబివృద్ధి నాకు రాదు. వైఎస్‌తో కుమ్మక్కయి మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నవన్నీ కక్కిస్తాం అన్నారు. మావాళ్లపైన కేసులు లేవని గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల తదితరులపైనే కేసులు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. టీడీపీతో వెళుతున్న బీజేపీ కూడా భూస్థాపితం అవుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్ ముఖ్యమంత్రి పదవి అడిగితే తప్పేముందని కేసీఆర్ ప్రశ్నించారు. కచ్చితంగా సీఎం పదవి అడుగుతామని, టీఆర్‌ఎస్‌కే ఆ అర్హత ఉందని అన్నారు. ఉద్యమాలు చేయని విూకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్కు 35 సీట్లు మించి రావని అన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో అన్ని కీలకాంశాలను ప్రస్తావించామని కేసీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ రెండో జాబితాను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సామాజిక కోణంలోనే టికెట్ల కేటాయింపు జరిగిందని కేసీఆర్ తెలిపారు. కాగా పదేళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. 13 ఏళ్ల రాజకీయ చరిత్రలో టీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లతో పాటు మైనార్టీల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. పది జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విస్తరిస్తామన్నారు. వచ్చే అయిదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని, ప్రభుత్వ ఖర్చుతో అమరవీరులకు స్థూపాలు నిర్మిస్తామని తెలిపారు. లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, ఆటో రిక్షాలపై రవాణా పన్ను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నామన్నారు. వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇస్తామని, ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని, బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఇక తెలంగాణ ముందు పెను సవాళ్లు ఉన్నాయన్నారు. విద్యుత్ గండం నుంచి గట్టెక్కాల్సి ఉందన్నారు. సంక్షేమం ,వ్యవసాయం,పారిశ్రామిక అబివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. దళితుల అభివృద్ది కోసం ప్రత్యేక నిధులతో వచ్చే ఐదేళ్లో అభివృద్దికి 50వేల కోట్లు వారి కోసం ఖర్చు చేస్తామన్నారు. అంచనాల ప్రకారం తెలంగాణ బడ్జెట్ 40,50వేల కోట్ల వరకు వరకు ఉంటుంది. 15.4 శాతం దళత జనాభా ఉంది. 5వేల కోట్లు ప్రతియేటా ఖర్చు చేసేలా ఫోకస్ చేస్తం. సుమారు 50వేల కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేసే అవకాశం ఉంది. బిసిలకు 25వేల కోట్లు, ముస్లింల అభివృద్దికి వేయికోట్లు ఖర్చు చేస్తామన్నారు. తెలంగాణలో గిరిజనులు 12 శాతం అవుతారని, వాల్మీకి గిరిజనలుకు గిరజన ¬దా ఇస్తామన్నారు. తండాలను పంచాయితీలుగా చేస్తాం. వాళ్లతండాలో వారి రాజ్యమే రాబోతోంది. ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పాటు చేస్తాం 12శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామన్నారు. ఉద్యోగలు సమ్మెతో సకలజనుల సమ్మెను అమోఘంగా నడిపి తెలంగాణ ఏర్పాటులో కీలకభూమిక పోషించారు. వారితో ఎంప్లాయి ప్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది. చీటికిమాటికి బదిలీలు ఉండవు.తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తాం. కేంద్రంతో సమానంగా పెన్షన్లు. రిటైర్ అయిన వారికి కూడా వర్తింప చేస్తామన్నారు. కంట్రాక్ట్ ఉద్యోగులను ఇచ్చిన హావిూ మేరకు రెగ్యులరైజ్ చేస్తూ నిరుద్యోగుల కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. కొత్త ఉద్యోగాల ద్వారా లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి. చీటికి మాటికి ఉద్యోగలు బదిలీలు ఉండవు. 3వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టుల చేపడతామన్నారు. అమరులకు జిల్లా కేంద్రాల్లోస్థూపాలు నిర్మిస్తాం.తెలంగాణ ఆవిర్భావం రోజున జిల్లా అదికారులు మంత్రులు శ్రద్దాంజలి ఘటించిన తరవాతనే అధికార కార్యక్రమాలు చేపట్టేలా చేస్తామన్నారు. వారి కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. హైదరాబాద్ స్మృతి చిహ్నం. వ్యవసాయ కుటుంబాలకు భూమి, ఆరోగ్యం, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బలహీనవర్గాలకు గృహనిర్మాణం… ఇంజనీర్లతో అంచాలను వేశాక పిల్లర్లు, రెండు పడకలతో డబుల్ బెడ్‌రూమ్ కనీస వసతులతో కల్పిస్తాం. ఇదంతా ప్రభుత్వ కర్చుతో నిర్మించి ఇస్తామన్నారు. గతంలో ఉన్న గృహరుణాలు రద్దు చేస్తాం. వికలాంగులు, వృద్దులకు వేయి రూపాయిలు. పెన్షన్లు ఇస్తామన్నారు. ఆటోలకు రవాణా పన్ను మినహామింపుతో పాటు వేధింపులు ఉండవు. ఇక వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని కెసిఆర్ ప్రకటించారు. భారతదేశానికి మొత్తంగా విత్తనాలు సరఫరా చేసే శక్తిగా తెలంగాణను అభివృద్ది చేస్తామన్నారు. కమతాల ఏకీకరణ చేసి రైతులు భూముల్లో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి. వాతావరణం అనుకూలంగా ఉందా లేదా.. శాస్త్రవేత్తల అధ్యయనంతో విత్తన ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. 75 శాతం సబ్సిడీతో 3 ఎకరాలకు ఓ గ్రీన్ హౌజ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో జిక్లాలో తొలుత వేయి ఎకరాలు అభివృద్ది చేసి తెలంగాణను సీడ్ బౌల్ ఆప్ ఇండియాగా రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ పెట్టి నడిపిస్తుందన్నారు. ప్రవైవేట్ వారిని ఇంటిగ్రేట్ చేస్తాం, లక్షవరకు రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణకు వాటాను నీళ్లను రాబట్టుకుని, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. మైనర్ ఇరిగేషన్ దెబ్బతీసారని, పాత చెరువుల పునరుద్దరణ చేపడతామన్నారు. సచార్ కమిటీ నిర్ణయాలను అమలు చేస్తాం.. వక్ఫ్ భూములు కాపాడుతాం. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారలు ఇస్తాం. ఉర్దూను అభివృద్ది చేసి, రెండో అధికార భాషగాగుర్తిస్తామన్నారు. చంచల్ గూడ జైలు, రేస్‌కోర్సు తరలిస్తాం. అక్కడ అధ్బుతమైన విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉచిత నిర్బంద విద్య అమలుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కెజి నుంచి పిజి వరకు వంద శాతం అమలు చేస్తామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం మండల స్థాయినుంచే అమలు చేస్తామన్నారు. ఐటిఐఆర్..2లక్షల కోట్ల ఖర్చుతో సాఫ్ట్ వేర్ హబ్, హార్డ్వేర్ హబ్ రానుందని, దీనివల్ల హైదరాబాద్‌ను కనీస సదుపాయాలతో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. దీనికి మాస్టర్ ప్లాన్ ఉండాలి. అంతర్జాతీయ స్థాయి ప్లాన్. దీనికి 3500 నుంచి 4వేల మెగావేట్ల వరకు విద్యుత్ అవసరం. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామన్నారు. అవినీతి రహిత పాలన.. బెస్ట ఇండస్ట్రియల్ పాలసీ.. సింగిల్ విండో పాలసీ తీసుకుని వస్తామన్నారు. భూముల కేటాయింపు అధికారులతో కమిటీకి అప్పగిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలరకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. తెలంగాణ బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్‌గా జరుపుతామన్నారు. సాంస్కృతిక విధ్వంసం జరిగిందని, దీనిని పునరుద్దరించాల్సిన అవసరం ఉందన్నారు.
69 మందితో టీఆర్‌ఎస్ తొలి జాబితా
రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 69మంది అభ్యర్థుల టీఆర్‌ఎస్ తొలి జాబితాను కెసిఆర్ ప్రకటించారు. అమరుల కుటుంబాల నుంచి శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు హుజూర్‌నగర్ సీటును కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మల్యేలలో పరకాల ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతికి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఇటీవలే వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారందరికీ టికెట్లు కేటాయించారు. టీడీపీ నుంచి వచ్చిన బాబూమోహన్, మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండా సురేఖలకు కూడా టిక్కెట్లు దక్కాయి. వచ్చే ఎన్నికల్లో 14 ఎంపీ 75కు పైగా అసెంబ్లీ సీట్లను దక్కించుకుంటామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ జాబితాలో 55 శాతం బలహీనవర్గాల అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. మిగతా సీట్లకు ఒకటి రెండురోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోమారు కెసిఆర్ ప్రకటించారు. ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు. ఇక టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మెదక్ జిల్లా గజ్వెల్ నుంచి పోటీ చేయనున్నారు. జాబితాలో ప్రకటించిన వారి పేర్లు ఇలా ఉన్నాయి.గజ్వేల్- కేసీఆర్, సిద్దిపేట-హరీశ్‌రావు, ఆందోల్ – బాబుమోహన్, మెదక్ – పద్మాదేవేందర్ రెడ్డి, ఆదిలాబాద్-జోగు రామన్న, ముథోల్- వేణుగోపాలచారి, బోథ్-జి. నగేశ్, చెన్నూరు- నల్లాల ఓదేలు, సిర్పూర్ – కావేటి సమ్మయ్య, బెల్లంపల్లి- చిన్నయ్య, ఖానాపూర్ – రేఖానాయక్,ఆసిఫాబాద్ – కోవా లక్ష్మీ, నిర్మల్ – శ్రీహరిరావు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్- ఈటెలరాజేందర్, ధర్మపురి- కొప్పుల ఈశ్వర్, వేములవాడ- సి.హెచ్ రమేశ్ బాబు, కరీంనగర్ – గంగుల కమలాకర్, కోరుట్ల – విద్యాసాగర్ రావు,రామగుండం- సోమారపు సత్యనారాయణ, సిరిసిల్ల- కే.టీ. రామారావు, మానకొండూరు- రసమయి బాలకిషన్, హుస్నాబాద్ -వి. సతీష్ కుమార్, పెద్దపల్లి- డి. మనోహర్ రెడ్డి, మంథని – పుట్టమధు , నిజామాబాద్ జిల్లా బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి, జుక్కల్ – హన్మంత్ షిండే, కామారెడ్డి- గంప గోవగోవర్ధన్, బోధన్- షకీల్ అహ్మద్, ఆర్మూర్ – ఏ. జీవన్ రెడ్డి, బాల్కొండ – వి. ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి.. పరిగి- హరీశ్వర్ రెడ్డి, తాండూర్-పి.మహేందర్‌రెడ్డి, చేవెళ్ల – కేఎస్ రత్నం, వికారాబాద్ -బి. సంజీవరావు, మేడ్చల్ – సుధీర్ రెడ్డి, మహేశ్వరం – మనోహర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్- వి. శ్రీనివాస్ గౌడ్, మక్తల్ – వై ఎల్లారెడ్డి, కల్వకుర్తి- జైపాల్ యాదవ్, వనపర్తి- నిరంజన్‌రెడ్డి, జడ్చర్ల – సి. లక్ష్మారెడ్డి, అచ్చంపేట- గువ్వల బాలరాజు, దేవరకద్ర – ఎ. వెంకటేశ్వరరెడ్డి, ఆలంపూర్ – ఎం శ్రీనాథ్, గద్వాల- కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి, వరంగల్ జిల్లాలోని వరంగల్ (వెన్ట్)-దాస్యం వినయ్ భాస్కర్, డోర్నకల్- సత్యవతి రాథోడ్, స్టేషన్ ఘన్‌పూర్ – టి. రాజయ్య, భూపాలపల్లి- ఎస్ మధుసుదానాచారి,నర్సంపేట- సుదర్శన్ రెడ్డి, మలుగు- అజ్మీరా చందులాల్, వరంగల్ (ఈస్ట్)- కొండా సురేఖ, పాలకూర్తి- ఎన్ సుధాకర్ రావు, జనగామ- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వర్ధన్నపేట- రమేశ్‌నల్లగొండ జిల్లా సూర్యాపేట-జగదీశ్వర్‌రెడ్డి, ఆలేరు – గొంగడి సునీత, దేవరకొండ- బాలునాయక్, నకిరేకల్ – వీరేశం, హుజూర్‌నగర్ -శంకరమ్మ (శ్రీకాంతాచారి తల్లి), జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్- టి. పద్మారావు, మల్కాజ్‌గిరి – రాజేందర్, ఉప్పల్ – సుభాష్‌రెడ్డి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పిడమర్తి రవి, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్‌కు పార్టీ బీఫాంలు అందజేశారు.