ఫొటో జర్నలిస్టు అత్యాచార నిందితులకు మరణ శిక్ష


ముంబయి, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) :
ముంబయిలోని శక్తి మిల్స్‌ ఆవరణలో ఫొ టో జర్నలిస్టుపై సా మూహిక అత్యాచా రానికి పాల్పడిన ము గ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక న్య యాస్థానం వీరికి మరణదండనే సరైన శిక్ష అని పేర్కొం ది. ఈ ఘటనకన్నా సరిగ్గా నెల ముందు ఈ నిందితులే మరో యువతిపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం రెండు కేసులను పరిగణనలోకి తీసుకుని కఠిన శిక్ష విధించింది. ఇలాంటి విష యాల్లో కఠిన దండన తప్పదని తెలిపింది. సంచలనం సృష్టించిన ముంబై ఫొటో జర్నలిస్టు కేసులో ముగ్గురికి కోర్టు ముంబై మరణశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. విజయ్‌ జాదవ్‌, ఖాసీం బెంగాలీ, మహమ్మద్‌ సలీం అన్సారీలు అత్యాచారానికి పాల్పడ్డారని ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జ్‌ షాలినీ ఫన్సాల్కర్‌ తెలిపారు.