అనంతపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న రఘువీరారెడ్డి
అనంతపురం, ఏప్రిల్ 6 : నీలకంఠాపురంలో ఆం««ధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం జరుగుతున్న జెడ్‌పీటీసీ. ఎంపీటీసీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 7 గంటలకు జెడ్‌పీటీసీ. ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది.సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడక్కడ చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.