యూపీఏ హామీలన్ని నెరవేర్చింది


పేదరిక నిర్మూలనకు కట్టుబడింది : రాహుల్‌
రాయ్‌చూర్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) :
యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. పేదరి క నిర్మూలనే కాంగ్రెస్‌ లక్ష్యమని రాహు ల్‌ స్పష్టం చేశారు. గత పదేళ్లలో 15 కోట్ల మందిని పేదరికం నుంచి బయట కు తీసుకువచ్చామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేస్తున్న దని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని రా య్‌చూర్‌లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రా హుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో తాము ఇచ్చిన హామీని నెరవేర్చగలిగా మని అన్నారు. తాము ప్రజలకు వాస్తవా లు మాత్రమే చెబుతున్నామన్నా రు. కానీ బిజెపి అరచేతిలో వైకుంఠం చూపు తూ మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పేదల పక్షమని అన్నారు. తరతరాలుగా వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. బీజేపీ ఊకదం పుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్య పెడుతోందన్నారు. దాని
బుడగ పేలడం ఖాయమన్నారు. బీజేపీలాగా తమ పార్టీ హామీలిచ్చి తప్పుకునే పార్టీ కాదని ఒకసారి మాట ఇచ్చిందంటే నెరవేర్చి తీరుతుందని అన్నారు. బీజేపీ దేశంలోని ప్రజల మధ్య విద్వేషాలను రగల్చడం ద్వారా అధికారాన్ని పొందాలని చూస్తోందని, ఆ పార్టీ విద్వేష, విధ్వంస రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.