యువీ ఇంటిపై అభిమానుల రాళ్ళవర్షం
(జనంసాక్షి):టీ20 వరల్డ్ కప్ లో శ్రీలకపై పరాజయం పాలనై భారత్ ఆటగాళ్ళకు అభిమానుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వరల్డ్ కప్ వైఫల్యానికి యువి బ్యాటింగ్ లోపమే అని భావించిన అభిమానులు రాళ్ళతో యువరాజ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై స్పందించిన యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ స్పందిస్తూ ప్రపంచకప్ ఓటమికి తన కుమారుడిని ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని,విజయం సాధించినపుడు ప్రోత్సహించే అభిమానులే,విఫలమైనప్పుడు ఇలా దాడులకు పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అభిమానుల రాళ్లదాడితో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.