మెట్రో రైలు వచ్చేస్తొంది
(జనంసాక్షి) :
ప్రతిష్టాత్మక హైదరాబాద్ మొదటి మెట్రో రైలు కొరియా కోచ్ ఫ్యాక్టరీలో తయారయి భారత్ బయలుదేరింది.భారీ ఓడలో సముద్రమార్గాన వస్తున్నమొదటి మెట్రోరైలు మే మూడో వారానికల్లా హైదరాబాద్ చేరనుంది. దక్షిణకొరియా దేశం చాంగ్ వాన్ నగరంలోని రోటెమ్ ఫ్యాక్టరీ నుండి మొదటి డిస్పాచ్ విడుదలయి డాక్ యార్డు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ చైర్మన్ వై ఎమ్ డియోస్తలీ,వీబీ గాడ్గిల్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం జూన్ మాసంలో నాగోల్ నుండి మెట్టుగుడా వరకు మొదటి రైలు పరుగులు తీయనుంది. హైదరాబాదులో పూర్తిస్థాయి 72 కి.మీల దూరపు మెట్రోరైలు కార్యకలాపాలు 2015 మార్చికల్లా పూర్తవనున్నాయని ఎల్ అండ్ టీ హైదరాబాద్ ప్రతినిధి వైఎమ్ డియోస్తలీ వెళ్లడించనున్నారు. ప్రస్తుతానికి 171 బోగీల ఆర్డర్ దక్షిణకొరియా కోచ్ ఫ్యాక్టరీకి లభించగా మొదటి డిస్పాచ్ ప్రస్తుతం సముద్రమార్గాన ఇండియా రానుంది…