ఎంపీ పాల్వాయిపై జైరాం రమేశ్ ఫైర్

నల్లగొండ : ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి తన కుమార్తె స్రవంతిని నామినేషన్ వేయించడం సరికాదని మండిపడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని పాల్వాయిని జైరాం ఆదేశించారు. స్రవంతికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సూచించారు. లేనిచో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.