దర్యాప్తు ప్రారంభం

(జ‌నంసాక్షి):26 దేశాలు 34 రోజుల పాటు మిలియన్ డాలర్లు వెచ్చించి వెతికినా దొరకని విమానం పై మలేషియా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. విమానం దారి మారగానే ఆ విమానం ఎటువెళ్తుందో ఎందుకు గమనించలేదు? దాని వెతకడంలో ఆలస్యం ఎందుకు జరిగింది?ఇందులో పౌర విమానయాన రంగం తప్పు ఎంత? మిలటరీ విభాగం తప్పు ఎంత? దీనికి బాధ్యులెవరు? అనేకోణంలో దర్యాప్తు చేపట్టింది.అయితే దర్యాప్తు విషయాల పై ఇప్పటి వరకూ ప్రభుత్వం అధికారకంగా ధ్రువీకరించ లేదు
విమానం కుప్పకూలడానికి కొన్ని నిమిషాల ముందు కోపైలట్ ఒక అర్జంట్ ఫోన్ తన సెల్ నుంచి చేశాడని, సిగ్నల్స్ లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ కాలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఏదో అసాధారణ పరిస్థిత ఉందని గమనించి, ఆయన ఫోన్ చేశారా? అన్నది తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.