అమేథిలో రాహుల్‌ నామినేషన్‌


2004, 09లో ఒపీనియన్‌ పోల్స్‌ మాకు వ్యతిరేకమే..
అయినా మేమే గెలిచాం
కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం : రాహుల్‌
అమేథి, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంక, పార్టీ కార్యకర్తలు, నాయకులు వెంటరాగా ఆయన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒపీ నియన్‌ పోల్స్‌ గతంలో ఏం చెప్పామో, ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలు సని అన్నారు. 2004, 2009లో కాంగ్రెస్‌కు వ్యతిరేకరంగా ఒపీనియన్‌ పోల్స్‌ వచ్చినా గెలుపు కాంగ్రెస్‌దే అయ్యిందన్నారు. అమేథిలో రాహుల్‌ నామినేషన్‌ దాఖ లు చేశారు. ఇక్కడ వచ్చే నెల7న ఎన్నిక జరుగనుంది. తల్లి సోనియా, తన సోదరి ప్రియాంక వెంటరాగా ఆయన నామినేషన్‌ దాఖలు
చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా తరలిరాగా సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్‌ తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ తల్లి సోనియా, తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్లాడు. కార్ల ర్యాలీతో అమేథీలో అట్టహాసం కనిపించింది. ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఇక్కడికి రాగానే ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ నినాదాలతో రహదారి పొడవునా ¬రెత్తింది. అమేథీ నుంచి భారీ మెజారిటితో విజయం సాధించడం ఖాయమని అక్కడి కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఆయనకు 500 కిలోల గులాబీలతో ఇక్కడి మహిళా కార్యకర్తలు స్వాగతం పలికారు. కాగా అంతకు ముందు రాహుల్‌ గాంధీకి ఘనస్వాగతం చెప్పేందుకు స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ సన్నాహాలు చేశారు. దాదాపు అయిదు వందల టన్నుల పూలతో పాటు, రాహుల్‌ వచ్చే దారి మొత్తం పూల బాటగా మార్చేశారు. నామినేషన్‌ దాఖలు చేయటానికి ముందు రాహుల్‌ అమేథీలో రోడ్‌ షో నిర్వహించారు. అట్టహాసంగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం అమేథీ లోక్‌ సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ కార్యక్రమంలో ఆయనతో పాటు తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంక, రాబర్ట్‌ వాద్రా పాల్గొన్నారు. గౌరీగంజ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రాహుల్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ అమేథీ తన కుటుంబం లాంటిదని అన్నారు. 2004, 2009 ఎన్నికల్లో అమేథీ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని, మరోసారి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమేథీలో కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరని రాహుల్‌ అన్నారు. కాగా నరేంద్ర మోడీ వివాహ అంశంపై విలేకర్లు ప్రశ్నించగా మోడీ వ్యక్తిగత విషయాలపై తాను వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. రైతులకు, మహిలలకు కాంగ్రెస్‌ అనేక పథకాలు చేపట్టిందన్నారు. మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు. రోడ్ల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇక కాంగ్రెస్‌ గెలవందంటూ వస్తున్న ఒపీనియన్‌ పోల్స్‌ను పట్టించుకోబోమన్నారు. గతంలో ఇలాంటివే వచ్చాయన్నారు. తమ గెలుపు ఎవరూ ఆపలేరన్నారు.