కేసీఆర్‌ మాటల మరాఠే


మాటలతో కోటలు నిర్మిస్తరు
దామోదర రాజనర్సింహ ఎద్దేవా
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మాటల మారఠి అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన మాటలతోనే కోటలు నిర్మస్తరని ఎద్దేవా చేశా రు. ఆయన మాటలు నమ్మితే మొదటికే మో సం వస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తిం చాలని అన్నారు. ఆదివారం కాప్రా సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ టీడీపీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు పలువురు నాయకు లు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా లెక్కచేయకుం డా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీయే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కూడా చేసి చూపిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధిపై కేసీఆర్‌ చెప్తోన్న మాటలు నమ్మ శక్యం గా లేవని ఆయన
అన్నారు. ఆయన మాటలు ఎవరైనా నమ్మితే మొదటికే మోసం వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని ఆయన గుర్తు చేశారు.