ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను : ప్రియాంక


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి)
తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయ బోనని సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక అన్నారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమో డీకి ప్రత్యర్థిగా పోటీచేసే ఆలోచన లేదని ప్రియాంకగాంధీ స్పష్టం చే శారు. అలాగే తాను ప్రత్యక్ష రాజకీ యాల్లోకి నావాలనుకోవడం లేద న్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుం డా తనను ఎవరూ ఆపడంలేదని, సోదరుడు రాహుల్‌ గాంధీ సహా కుటుంబమంతా తాను పోటీ చేస్తానంటే సంపూర్ణ మద్దతు ఇస్తారని ప్రియాంక పేర్కొన్నారు. పోటీ చేయకపోవడం కేవలం తన వ్యక్తిగత నిర్ణయమని ఆమె ఓ ఛాన్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం తన లక్ష్యం అమేథి, రాయ్‌బరేలి లోక్‌సభ స్థానాల్లో సోదరుడు రాహుల్‌, తల్లి సోనియాగాంధీ తరపున ప్రచారం చేయడమేనని స్పష్టం చేశారు. ప్రియాంకగాంధీ వారణాసి నుంచి పోటీ చేయడానికి సుముఖత చూపుతుంటే కొంతమంది కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం చెప్పారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ప్రియాంక తన వైఖరిని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న వార్తలు అబద్దమని దీంతో తేలిపోయింది. ఇదే నిజమైతే దేశం యావత్తు దృష్టి ఈ పోటీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఆసక్తికర పోటీకి అవకాశం లేకపోలేదంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో సోనియా తనయ ప్రియాంక గాంధీని బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రియాంకను పోటీకి దించితే మోడీకి చెమటలు పట్టడం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలీ, అమేథీలో ప్రజాకర్ష ప్రచారకర్తగా ఉన్న ప్రియాంక దూసుకుపోతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. అయితే మోడీకి చెక్‌ పెట్టగల సమర్థురాలు ప్రియాంక గాంధీయేనని, ఆమెను వారణాసిలో పోటీకి దించాలన్న ప్రతిపాదన వచ్చింది. సీనియర్‌ నాయకులు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచన చేశారు. పోటీకి ప్రియాంక విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌ పెద్దలు వెనక్కు తగ్గారు. మోడీపై పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేయడంలో ఆసక్తికర పోటీ ప్రతిపాదన ఆదిలోనే ఆగిపోయింది. రాయబరేలీ, అమేథీ మాత్రమే పరిమితమవుతానని ఆమె పేర్కొన్నారు.