నో ఆప్షన్స్‌ సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే : దేవీప్రసాద్‌


కరీంనగర్‌టౌన్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వ ద్దని, వారు సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లిపోవాల్సిం దేనని టీఎన్‌జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు. శనివారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్ర మంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన 58 : 42 : 10 : 13 ప్రాతిపదికన కాకుండా స్థానికత ఆధారం గానే చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగుల విభజన సైతం వారి స్థానికత ఆధారం గానే చేపట్టాలని కోరారు. తెలంగాణలోని ప్రధాన కార్యాలయాల్లో, సెక్రటేరియట్‌లో, జిల్లా కార్యాల యాల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగులే పనిచే యాలని, ఆంధ్ర ప్రాంతం వారికి ఎట్టి పరిస్థితు ల్లోనూ ఇక్కడ అవకాశాలు కల్పించవద్దని కోరా రు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్య లు చేపట్టాలని కోరారు. తెలంగాణ
రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అలాగే తెలంగాణ సమరయోధుల పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో రికార్డు అసిస్టెంట్‌ పనిచేస్తూ మరణించిన వేణుగోపాల్‌రెడ్డి, హుజూరాబాద్‌ కేసీ క్యాంపు ఉద్యోగి హరినాథ్‌, దరూర్‌ ఏటీవో హస్నోద్దిన్‌ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎంఏ హమీద్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.