మంథనిలో మొదలైన టీఆర్‌ఎస్ సభ

కరీంనగర్: మంథని నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభ మొదలైంది. ఈ సభకు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్వ్రాఉ హాజరయ్యారు. కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకోగానే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు జైతెలంగాణ నినాదాలతో స్వాగతం పలికారు. మంథని వేదపండితులు కేసీఆర్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.