బొగ్గు మసిపై దాసరిని ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 (జనంసాక్షి) :
బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ఆ శాఖ మాజీ మంత్రి దాసరి నారాయణరావును సోమవారం సీబీఐ ప్రశ్నిం చింది. హిందాల్కోకు కేటాయింపుల కేసులో సీబీఐ అధి కారులు దాసరిని ప్రశ్నించినట్లు సమాచారం. బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి రెండు కేసులను సీబీఐ మూసివేసింది. సరైన ఆధారాలు లేనందున జేఎ ల్‌డీ యావత్మల్, జేఏఎస్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పై పెట్టిన రెండు కేసులు మూసివేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. పరేఖ పుస్తకం విడుదల తరవాత సిబిఐ
మరోమారు చురుకుగా వ్యవహరిస్తోంది. దీంతో బొగ్గు కుంభకోణం దాసరిని వెంటాడుతోంది. ఆయన పాత్రపైనా ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో బొగ్గు శాఖ ఉన్న సమయంలోనే బొగ్గు బ్లాకు కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లుగా కాగ్ తేల్చింది.