కాంగ్రెస్‌తోనే ప్రజలకు మేలు : రాంరెడ్డిదామోదర్‌రెడ్డి

నల్గొండ, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి ఓట్లు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్‌దే అని దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.