రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేం
ధర్మాసనానికి కేసు శ్రీఆగస్టు 20కి వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ, మే 5 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలిన వేసిన పిటిషన్‌పై పిటిషనర్లకు మరోమారు చుక్కెదు రయ్యింది. దీంతో సమైక్యవాదులకు అత్యున్నత న్యా యస్థానం సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగి లింది. అలాగే అపాయింటెడ్ డేపై స్టేకు సుప్రీం నిరాక రించింది. విచారణను ధర్మాసనానికి రెఫర్ చేస్తూ కేసు ను ఆగస్టు 20కి వాయిదా వేసింది. రాష్ట్ర విభజనను అ డ్డుకోవడానికి సమైక్యవాదులంతా కట్టగట్టుకుని వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జూన్ 2 అపా యింటేడ్ డే పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. లగడపా టి రాజగోపాల్ మొదలుకుని, మాజీ సీఎం కిరణ్‌కుమా ర్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌రెడ్డి, వైసీసీ నేత మేక పాటి రాజమోహన్‌రెడ్డి సహా మొత్తం 20 మందికి పైగా సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరి పింది. రాష్ట్ర విభజన పక్రియపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే, ఈ విషయంలో కోర్టుకు ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. పార్లమెంటులో ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి, ఇప్పుడైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్ దాఖలైంది. ఇంతకుముందు పలుమార్లు రాష్ట్ర విభజనపై పలువురు నాయకులు, న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, అప్పటికి ఇంకా సమయం పరిపక్వం కాలేదంటూ ఆయా పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వాదన వినక ముందే రాష్ట్ర విభజన అంశంపై ఎలాంటి జోక్యం చేసుకోలేమని కోర్టు పదే పదే చెప్పినా వినని పిటిషనర్ల తరపు న్యాయవాదులు, ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై న్యాయస్థానం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును చేపల మార్కెట్‌లా మార్చొద్దని హితవు పలికింది. విచారణ మధ్యలో అనవసరంగా జోక్యం చేసుకున్న ఎంపీ ఉండవల్లిపై జడ్జీ తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 6 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆగస్టు 20కు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 20న ఏ ధర్మాసనం విచారణ చేయాలన్న దానిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. విభజనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు చేరింది. విభజనపై వేసిన 24 పిటిషన్లపై కోర్టు ఒకే సారి విచారణ జరపనుంది. విభజన అంశంపై సుప్రీం గతంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విభజనపై కోర్టు ఇంతకు ముందే స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై పిటిషనర్లు స్టే కోరగా దానిని తిరస్కరించింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజనపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. అనంతర విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజున విభజన పిటిషన్లను ఏ ధర్మాసనం విచారణ చేయాలన్న దానిసై సుప్రీం నిర్ణయం తీసుకోనుంది. విభజనపై ఇప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. స్టే ఇవ్వలేమని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. పూర్తిస్థాయి విచారణ తర్వాతే స్టే పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడంపై తదుపరి విచారణ తర్వాతే నిర్ణయిసస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అపాయింటెండ్ డేట్ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టును కోరారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి దత్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును చేపల మార్కెట్ చేయవద్దన్నారు.